Advertisement

టోటల్‌గా అమెరికాలో తీసిన ‘ఛేజ్‌’ రిలీజ్‌కి రెడీ

Tue 21st Apr 2015 12:06 AM
telugu movie chase,chase movie releasing on 25th april,mohan nimmakayala  టోటల్‌గా అమెరికాలో తీసిన ‘ఛేజ్‌’ రిలీజ్‌కి రెడీ
టోటల్‌గా అమెరికాలో తీసిన ‘ఛేజ్‌’ రిలీజ్‌కి రెడీ
Advertisement

తెలుగు దర్శకనిర్మాతలు అమెరికాలాంటి విదేశాల్లో సినిమాలు తియ్యడం మామూలే. కానీ, అమెరికాలో స్థిర పడిన తెలుగు దర్శకనిర్మాత అక్కడి నటీనటులతో, అక్కడి టెక్నీషియన్స్‌తో సినిమా తియ్యడమనేది అరుదుగా జరుగుతుంది. అలాంటి నిర్మాతే మోహన్‌ నిమ్మకాయల. పినాకిన్‌ ఆర్ట్స్‌ పతాకంపై రామ్‌ దివ్యేష్‌, స్పందన అల్లూరి జంటగా స్వీయ దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘ఛేజ్‌’. యాక్షన్‌ అండ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్‌ 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకనిర్మాత మోహన్‌ నిమ్మకాయల, గేయ రచయిత వేణు జయరామ్‌, పబ్లిసిటీ డిజైనర్‌ వాసు ప్రేమ్‌, డిస్ట్రిబ్యూటర్‌ రాజశేఖర్‌ పాల్గొన్నారు. 

మోహన్‌ నిమ్మకాయల: ఈ సినిమాని టోటల్‌గా అమెరికాలోనే చిత్రీకరించడం జరిగింది. అమెరికాలోనే పుట్టి పెరిగిన రామ్‌ దివ్యేష్‌, స్పందన అల్లూరి జంటగా నటించారు. వీరిద్దరూ డాక్టర్లే. అలాగే ఈ చిత్రానికి టెక్నీషియన్స్‌ కూడా అమెరికాకు చెందినవారే. సంగీతం మాత్రం ఇక్కడ శంకర్‌ తమిరితో చేయించాము. ఇందులోని పాటలకు వేణు జయరామ్‌ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ చిత్రం పూర్తి యాక్షన్‌తోపాటు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో వుంటుంది. ఇది మైండ్‌ గేమ్‌తో నడిచే కథ. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండిరగ్‌ వరకు చాలా స్పీడ్‌గా ఎక్కడా బోర్‌ లేకుండా తియ్యడం జరిగింది. మా చిత్రానికి సెన్సార్‌ పూర్తయింది. క్లీన్‌ ‘యు’ సర్టిఫికెట్‌ ఇచ్చారు. సినిమా చాలా బాగుందని, అమెరికాలో యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో చేసిన ఈ సినిమాకి ఎలాంటి కట్స్‌ లేకుండా క్లీన్‌ యు సర్టిఫికెట్‌ ఇవ్వడం ఆనందంగా వుందని సెన్సార్‌ సభ్యులు చెప్పారు. అమెరికాలో చాలా సినిమాలు తీసారు. అక్కడికి షూటింగ్‌కి వెళ్ళినపుడు అక్కడి ఏజెంట్స్‌ కొన్ని లొకేషన్స్‌ చూపిస్తారు. ఆ లొకేషన్స్‌లోనే షూటింగ్‌ చేసుకొని వచ్చేస్తారు. మేం 20 సంవత్సరాలుగా అక్కడే వున్నాం కాబట్టి ఏ లొకేషన్‌ బాగుంటుంది, రేర్‌ లొకేషన్స్‌ ఎక్కడ వున్నాయనే విషయం మాకు బాగా తెలుసు. అందుకే ఇప్పటివరకు ఎవరూ చెయ్యని లొకేషన్స్‌లో ఈ సినిమా తియ్యడం జరిగింది. ఇందులో తీసిన చేజ్‌ చాలా అద్భుతంగా వచ్చింది. ఇది హాలీవుడ్‌ మూవీలా అనిపించే తెలుగు సినిమా. ఈ నెల 24న యు.ఎస్‌.లో, 25న ఇండియాలో రిలీజ్‌ చేస్తున్నాం. 

వేణు జయరామ్‌: యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో వుండే ఈ సినిమాలో మెలోడీ పాటలు  కూడా పెట్టొచ్చని ఆలోచించి నాతో అలాంటి పాటలు కూడా రాయించారు డైరెక్టర్‌గారు. పాటల విషయంలో నాకు పూర్తి ఫ్రీడమ్‌ ఇచ్చారు. ఆడియో చాలా రోజుల క్రితమే రిలీజ్‌ అయింది. అందరి నుంచి మంచి అప్లాజ్‌ వస్తోంది. ఈ సినిమాని చూసి మంచి విజయం అందించి మమ్మల్ని బ్లెస్‌ చేస్తారని ఆశిస్తున్నాను.

వాసు ప్రేమ్‌: మోహన్‌గారికి మంచి టేస్ట్‌ వుంది. ఆయన అమెరికాలో వుంటూనే ఇక్కడ నాతో ఈ సినిమాకి సంబంధించి డిజైన్స్‌ అన్నీ చేయించారు. ఏ డిజైన్‌ ఎలా వుండాలో చెప్పి చేయించుకున్నారు. ఫైనల్‌గా మంచి ఔట్‌పుట్‌ వచ్చింది. ఒక పెద్ద సినిమా రేంజ్‌లో డిజైన్స్‌ వున్నాయని అందరూ చెప్తున్నారు. సినిమా కూడా పెద్ద రేంజ్‌లోనే వుంటుంది. తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది.

రాజశేఖర్‌: నేను సీడెడ్‌ డిస్ట్రిబ్యూటర్‌ని. ఇప్పటివరకు 100కి పైగా సినిమాలను డిస్ట్రిబ్యూట్‌ చేశాను. ఈ సినిమా నేను చూశాను. ఒక సినిమా చూస్తే అది ఎంత వరకు వర్కవుట్‌ అవుతుందనేది మా అనుభవంతో ఎక్స్‌పెక్ట్‌ చెయ్యగలం. ఈ సినిమా మాత్రం చాలా ఎక్స్‌లెంట్‌ వచ్చింది. తప్పకుండా ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్‌ చేస్తారు. అందుకే సినిమాని ఎవరికీ అమ్మొద్దని, మనమే సొంతంగా రిలీజ్‌ చేద్దామని చెప్పాను. మన రెండు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, ఒరిస్సా, ముంబాయి, ఓవర్సీస్‌లో 100 సెంటర్స్‌లో రిలీజ్‌ చేస్తున్నాం. తప్పకుండా ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement