Advertisement

డా॥ మోహన్‌బాబు ఆవిష్కరించిన ‘దొంగాట’ ఆడియో

Sun 12th Apr 2015 01:43 AM
dongata audio,laxmi manchu,mohan babu,adavi sesh,vamsi krishna  డా॥ మోహన్‌బాబు ఆవిష్కరించిన ‘దొంగాట’ ఆడియో
డా॥ మోహన్‌బాబు ఆవిష్కరించిన ‘దొంగాట’ ఆడియో
Advertisement

లక్ష్మీ మంచు, అడవి శేష్‌ ప్రధాన పాత్రధారులుగా విద్యా నిర్వాణ సమర్పణలో మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎన్‌.వంశీకృష్ణ దర్శకత్వంలో లక్ష్మీ మంచు నిర్మిస్తున్న చిత్రం ‘దొంగాట’. ఈ చిత్రం ఆవిష్కరణ శనివారం హైదరాబాద్‌లోని జె.ఆర్‌.సి. కన్వెన్షన్‌ సెంటర్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డా॥ మోహన్‌బాబు ఆడియోను ఆవిష్కరించారు.  రఘు కుంచె, సాయికార్తీక్‌, సత్యమహావీర్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ ఆడియో మంచు మ్యూజిక్‌ ద్వారా విడుదలైంది. మంచు మ్యూజిక్‌ లోగోను కె.రాఘవేంద్రరావు, మంచు విష్ణు, శ్రీమతి నిర్మల, వివియానా, అరియానా, నిర్వాణ కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..

కె.రాఘవేంద్రరావు: దొంగాట అనే టైటిల్‌తో మంచు లక్ష్మీ చేస్తున్న ఈ సినిమాలో అందరు హీరోలను పెట్టి డబ్బు దోచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆమె ప్రయత్నం సక్సెస్‌ అయి సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. 

నాగార్జున(ఎ.వి. ద్వారా): ఈ సినిమాలో గెస్ట్‌ రోల్‌ చేశాను. ఇందులో లక్ష్మీ పాడిన పాట నాకు బాగా నచ్చింది. ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్న వంశీకృష్ణ చాలా టాలెంటెడ్‌. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది. 

డా॥ మోహన్‌బాబు: క్రమశిక్షణ అనేది ఎన్టీఆర్‌గారు, అక్కినేని నాగేశ్వరరావుగారు, దాసరి నారాయణరావుగారి దగ్గర నేర్చుకున్నాం. ఏ పనిచేసినా క్రమశిక్షణ వుండాలనేది నా పాలసీ. నేను లక్ష్మీని చదువుకొమ్మని చెప్పాను. అయితే చదువుకొని సినిమా రంగానికి వచ్చింది. నిర్మాతగా కూడా మారింది. మంచి సినిమాలు చెయ్యమని సలహా ఇచ్చాను. ఈ సినిమా మంచి సక్సెస్‌ కావాలని భగవంతుడ్ని కోరుతున్నాను. లక్ష్మీని సింగర్‌ చేయాలని తన చిన్నప్పుడే అనుకున్నాను. ఎవరి దగ్గరికి తీసుకెళ్ళినా ఆ అవకాశం రాలేదు. అయితే ఈ సినిమాలో లక్ష్మీ పాడిన పాట విని నేను చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. ఎల్‌.ఆర్‌. ఈశ్వరి వాయిస్‌ని మళ్ళీ గుర్తు చేసిందనిపించింది. ఈ సినిమా విషయానికి వస్తే రషెస్‌ చూశాను. నాకు బాగా నచ్చింది. చాలా డిఫరెంట్‌గా వుంది. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ యూనిట్‌లోని అందరికీ ఆల్‌ ది బెస్ట్‌ చెప్తున్నాను.

తమన్నా: నా ఫస్ట్‌ మూవీ మోహన్‌బాబుగారి బేనర్‌లో చేశాను. అప్పటి నుంచి నాకు లక్ష్మీ పరిచయం. చాలా హెల్ప్‌ఫుల్‌గా వుంటుంది. ఈ సినిమాలో తను పాడిన పాట నాకు బాగా నచ్చింది. వంశీకృష్ణ ‘శ్రీ’ సినిమా చేసే టైమ్‌ నుంచి పరిచయం. తను ఈ సినిమా ద్వారా దర్శకుడుగా పరిచయం అవుతున్నందుకు చాలా హ్యాపీగా వుంది. 

మంచు లక్ష్మీ: నేను సింగర్‌ కావాలన్న నాన్నగారి కోరిక ఈ సినిమాతో తీరింది. పాట విని చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యారు, నన్ను మెచ్చుకున్నారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఒక మంచి సినిమా చెయ్యడంలో యూనిట్‌లోని ప్రతి ఒక్కరి సపోర్ట్‌ వుంది. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. 

మంచు విష్ణు: అక్క మంచి నటి, మంచి నిర్మాతగానే కాకుండా మంచి సింగర్‌ కూడా అని ఈ సినిమాలో తను పాడిన పాట ద్వారా ప్రూవ్‌ చేసుకుంది. ఇప్పుడు మంచు మ్యూజిక్‌ అనే ఆడియో సంస్థను స్టార్ట్‌ చేసింది. ఈ యూనిట్‌లోని అందరికీ ఆల్‌ ది బెస్ట్‌ చెప్తున్నాను.

మంచు మనోజ్‌: ఈ చిత్ర దర్శకుడు వంశీ నేను ఇంటర్మీడియట్‌లో వున్నప్పటి నుంచే పరిచయం. ఈ సినిమా బాగా వచ్చిందని అందరూ చెప్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని నేను కూడా అందరిలాగే ఎదురుచూస్తున్నాను. 

సుధీర్‌బాబు: ఈ సినిమాలో అందరు హీరోలతో కలిసి నటించడం మంచి కిక్‌ ఇచ్చింది. నా ఫస్ట్‌ మూవీ ఏమాయ చేసావెలో నా ఫస్ట్‌ షాట్‌ని గౌతమ్‌ మీనన్‌ లేకపోతే తనే డైరెక్ట్‌ చేశాడు. ఈ సినిమా ఎలా తీసి వుంటాడోనని నేను కూడా ఎదురుచూస్తున్నాను. 

వంశీకృష్ణ: మోహన్‌బాబుగారి చేతులమీదుగా ఈ ఆడియో రిలీజ్‌ అవ్వడం చాలా హ్యాపీగా వుంది. రఘుకుంచె, సాయికార్తీక్‌, సత్య మహావీర్‌ ఈ సినిమాకి చాలా ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ చేశారు. ఈ సినిమా బాగా రావడానికి నాకు సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌. 

ఇంకా ఈ ఆడియో ఫంక్షన్‌లో బి.గోపాల్‌, ఎస్‌.గోపాల్‌రెడ్డి, అడవి శేష్‌, చైతన్య, ప్రవీణ్‌ సత్తార్‌, చాణక్య బూనేటి, దశరథ్‌, మధునందన్‌, రఘు కుంచె, సాయికార్తీక్‌, నరేష్‌, దశరథ్‌, సుమంత్‌, సుశాంత్‌లతోపాటు చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement