Advertisement

‘దోచేయ్‌’ రిలీజ్ డేట్ మారింది..!

Wed 01st Apr 2015 07:38 AM
naga chaitanya,telugu movie dochay,sudheer varma,kriti senon,sunny mr,dochay on 24th april  ‘దోచేయ్‌’ రిలీజ్ డేట్ మారింది..!
‘దోచేయ్‌’ రిలీజ్ డేట్ మారింది..!
Advertisement

ఏమాయ చేసావె, 100% లవ్‌, తడాఖా, మనం వంటి సూపర్‌హిట్‌ చిత్రాల హీరో యువసామ్రాట్‌ నాగచైతన్య కథానాయకుడిగా, 1 నేనొక్కడినే ఫేం కృతి సనన్‌ హీరోయిన్‌గా, స్వామిరారా వంటి సూపర్‌హిట్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధీర్‌వర్మ దర్శకత్వంలో అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్‌ని నిర్మించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ‘దోచేయ్‌’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రం ఏప్రిల్‌ 24న సమ్మర్‌ స్పెషల్‌గా రిలీజ్‌ కాబోతోంది. 

ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘నాగచైతన్య హీరోగా స్వామిరారా టీమ్‌తో మా బేనర్‌లో నిర్మిస్తున్న ‘దోచేయ్‌’ చిత్రాన్ని ఏప్రిల్‌ 24న సమ్మర్‌ స్పెషల్‌గా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. అలాగే ఏప్రిల్‌ రెండోవారంలో లహరి మ్యూజిక్‌ ద్వారా ఈ  చిత్రం ఆడియోను గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నాం. మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 1 వరకు రోజుకొకటి చొప్పున విడుదల చేసిన సాంగ్స్‌కి, టీజర్స్‌కి చాలా ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తోంది. అభిమానుల ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్‌ అయ్యేలా, మా బేనర్‌ ప్రతిష్టను మరింత పెంచేలా సుధీర్‌వర్మ చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య కెరీర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌గా ‘దోచేయ్‌’ నిలుస్తుంది’’ అన్నారు. 

యువసామ్రాట్‌ నాగచైతన్య సరసన కృతి సనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రవిబాబు, రావు రమేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌, ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, కెచ్చా కంఫక్డే, విజయ్‌, డాన్స్‌: జానీ, శేఖర్‌, ఆర్ట్‌: నారాయణరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌ ఈదర, కో`ప్రొడ్యూసర్‌: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: సుధీర్‌వర్మ. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement