Advertisement

హ్యాట్రిక్‌ సక్సెస్ లో నిఖిల్ !!

Mon 30th Mar 2015 12:15 PM
surya vs surya hattick,hero nikhil,surya vs surya completed 25 days  హ్యాట్రిక్‌ సక్సెస్ లో నిఖిల్ !!
హ్యాట్రిక్‌ సక్సెస్ లో నిఖిల్ !!
Advertisement

స్వామిరారా, కార్తికేయ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల తర్వాత హీరో నిఖిల్‌ చేసిన మరో డిఫరెంట్‌ మూవీ ‘సూర్య వర్సెస్‌ సూర్య’. బేబి త్రిష సమర్పణలో సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండియా ప్రై. లిమిటెడ్‌ పతాకంపై కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్‌ నిర్మించిన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా 25 రోజులు పూర్తి చేసుకోవడమే కాకుండా నిఖిల్‌కి హ్యాట్రిక్‌ మూవీగా నిలిచింది. తనకు హ్యాట్రిక్‌ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు మార్చి 29న హైదరాబాద్‌లోని క్లబ్‌ రిపబ్లిక్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు నిఖిల్‌. ఈ సమావేశంలో హీరో నిఖిల్‌, మల్కాపురం శివకుమార్‌, చందు మొండేటి, చైతన్యకృష్ణ, సుధీర్‌వర్మ, చక్రి చిగురుపాటి, వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం, వైవా హర్ష, రాజా రవీంద్ర పాల్గొన్నారు. 

నిఖిల్‌: హ్యపీడేస్‌తో స్టార్ట్‌ అయిన నా కెరీర్‌ సుధీర్‌వర్మ డైరెక్షన్‌లో చేసిన ‘స్వామిరారా’ నాకు మంచి బ్రేక్‌నిచ్చింది. ఆ తర్వాత చందు మొండేటి డైరెక్షన్‌లో చేసిన ‘కార్తికేయ’ నాకు మరో హిట్‌ చిత్రమైంది. ఇప్పుడు కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో చేసిన ‘సూర్య వర్సెస్‌ సూర్య’ నాకు హ్యాట్రిక్‌ హిట్‌ని అందించింది. ఇకపై నా కెరీర్‌లో ఎన్ని విజయాలు సాధించినా వరసగా వచ్చిన ఈ హిట్స్‌ని ఎప్పటికీ మర్చిపోను. నాతో ఇంత మంచి సినిమాలు చేసిన దర్శకనిర్మాతలకు, మాకు విజయాల్ని అందిస్తున్న ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 

మల్కాపురం శివకుమార్‌: మా సినిమా రిలీజ్‌ అయి 25 రోజులు పూర్తవుతున్నా ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. నిఖిల్‌ అందరు హీరోల్లా కాదు. షూటింగ్‌ టైమ్‌లో ప్రొడక్షన్‌ బాధ్యత కూడా తీసుకోవడమే కాకుండా సినిమా ప్రమోషన్‌లో చాలా కేర్‌ తీసుకున్నాడు. సూర్య వర్సెస్‌ సూర్య 26 థియేటర్లలో 25 రోజులు పూర్తి చేసుకుంది. నిఖిల్‌తో సినిమా చేయడం చాలా హ్యాపీగా వుంటుంది. మళ్లీ నిఖిల్‌తో సినిమా చెయ్యడానికి నేను ఎప్పుడైనా సిద్ధంగా వుంటాను. 

సుధీర్‌వర్మ: స్వామిరారా సినిమా స్టార్ట్‌ చేసినపుడు ఆ సినిమా మీద ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ లేవు. నేను చెప్పిన కథ నచ్చి నిఖిల్‌, నిర్మాత చక్రిగారు ఓకే చేశారు. సినిమా బాగా రావడానికి వారిద్దరూ ఎంతో కోఆపరేట్‌ చేశారు. ‘స్వామిరారా’ మేం అనుకున్న దానికంటే పెద్ద విజయాన్ని సాధించింది. ఆ తర్వాత నిఖిల్‌ చేసిన కార్తికేయ, లేటెస్ట్‌గా సూర్య వర్సెస్‌ సూర్య చిత్రాలతో హ్యాట్రిక్‌ సాధించాడు. నిఖిల్‌ ఇలాగే సూపర్‌హిట్‌ సినిమాలు చేస్తూ వుండాలని కోరుకుంటున్నాను.

చందు మొండేటి: స్వామిరారా సినిమా ఘనవిజయం సాధించడంవల్లే కార్తికేయ వచ్చింది. ఇప్పుడూ సూర్య వర్సెస్‌ సూర్యతో మరో హిట్‌ కొట్టాడు నిఖిల్‌. అతను ఓకే అంటే కార్తికేయ 2 చేయడానికి నేను రెడీగా వున్నాను. 

 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement