Advertisement

‘ఉత్తమ విలన్‌’ ఆడియో రిలీజ్‌

Sat 28th Mar 2015 03:16 PM
uttama villain,kamal haasan,uttama villain audio,pooja kumar,ramesh arvind,ghibran  ‘ఉత్తమ విలన్‌’ ఆడియో రిలీజ్‌
‘ఉత్తమ విలన్‌’ ఆడియో రిలీజ్‌
Advertisement

యూనివర్సల్‌ హీరో కమల్‌హాసన్‌ హీరోగా ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సమర్పణలో తిరుపతి బ్రదర్స్‌ ఫిల్మ్‌ మీడియా ప్రై.లి., రాజ్‌కమల్‌ పిల్మ్‌ ఇంటర్నేషనల్‌ పతాకాలపై రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న విభిన్న చిత్రం ‘ఉత్తమ విలన్‌’. ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సి.కళ్యాణ్‌ అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఆవిష్కరణ శనివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల మధ్య ఘనంగా జరిగింది. ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ను హీరోయిన్‌ శృతిహాసన్‌ విడుదల చేయగా, పాటలను సి.కళ్యాణ్‌ విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో కె.విశ్వనాథ్‌, ఎస్‌.వి.కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి, ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం, గౌతమి, టి.సుబ్బరామిరెడ్డి, ఎన్‌.లింగుస్వామి, హీరోయిన్‌ పూజా కుమార్‌, సంగీత దర్శకుడు జిబ్రాన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. 

కమల్‌హాసన్‌: ఈ సినిమాలో నా గురువులు బాలచందర్‌గారు, విశ్వనాథ్‌గారు నటించడం నా అదృష్టం. ఈ సినిమా తమిళ్‌ ఆడియో రిలీజ్‌ అయినపుడు బాలచందర్‌గారి గురించి ఒక కవిత రాసి అక్కడ వినిపించాను. అయితే తెలుగులో కవిత రాసేంత పాండిత్యం నాకు లేదు కాబట్టి నా మిత్రుడు రామజోగయ్యశాస్త్రిని రిక్వెస్ట్‌ చేసి అదే మీనింగ్‌ వచ్చేలా తెలుగులో రాయమన్నాను. ఈ సినిమా విషయానికి వస్తే అందరికీ నచ్చే ఎమోషన్స్‌ ఈ చిత్రంలో చాలా వున్నాయి. రమేష్‌ చాలా అద్భుతంగా ఈ సినిమా తీశాను. జిబ్రాన్‌ మ్యూజిక్‌ చాలా ఎక్స్‌లెంట్‌గా ఇచ్చాడు. ‘ఉత్తమ విలన్‌’ తప్పకుండా మీ అందరికీ నచ్చే సినిమా అవుతుంది. 

కె.విశ్వనాథ్‌: బాలచందర్‌గారి దగ్గర అసిస్టెంట్‌గా చెయ్యాలన్న నా కోరిక తీరలేదు. వారం రోజులు మీ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తానని ఆయన్ని అడిగితే దానికి ఆయన కోప్పడ్డారు. అయితే కమల్‌ వల్ల బాలచందర్‌గారితో కలిసి నటించే అవకాశం ఈ సినిమా ద్వారా వచ్చింది. ఆయన డైరెక్టర్‌ అయినప్పటికీ ఈ సినిమాలో నటిస్తున్న టైమ్‌లో రమేష్‌ అరవింద్‌ని డైరెక్టర్‌ సర్‌ అని పిలిచేవారే తప్ప రమేష్‌ అని పేరు పెట్టి ఎప్పుడూ పిలవలేదు. ఆయనకు డైరెక్టర్స్‌ అంటే అంత గౌరవం. ఇక కమల్‌హాసన్‌ గురించి చెప్పాలంటే అతని డైరెక్షన్‌లో నటించడం చాలా కష్టం. ఒక డైరెక్టర్‌గా నేను ఎలా చెప్తే అలా చేస్తారు. ఎలాంటి క్యారెక్టర్‌ ఇచ్చినా దానికి పూర్తి న్యాయం చేస్తారు. పెద్దవాడిగా అతనికి నిండు నూరేళ్లు ఆయుష్షు వుండాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను.

రమేష్‌ అరవింద్‌: ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌ లాంటిది. ఎందుకంటే పెళ్ళి తర్వాత మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతూ వుంటాయి. ఈ సినిమా కూడా అలాంటిదే. ఇందులో ఒక కమల్‌హాసన్‌ ఎంతో హ్యాపీగా డాన్సులు చేస్తుంటాడు, మరో కమల్‌హాసన్‌ సినిమాల్లో సూపర్‌స్టార్‌గా వుంటాడు. అన్ని ఎలిమెంట్స్‌తో రూపొందించిన సినిమా ఇది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ వుంటే తెలుగు ఆడియన్స్‌ ఆదరిస్తారు. ఆ నమ్మకంతోనే ఈ చిత్రాన్ని అందరూ కలిసి చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాం. 

గౌతమి: స్వాతిముత్యం, సాగర సంఘమం లాంటి సినిమాలు మళ్ళీ కమల్‌కి రాలేదు. ఈ విషయం ఆయన్ని కూడా అడిగాను. అలాంటి సినిమా మళ్ళీ చూశానన్న ఫీలింగ్‌ ఈ సినిమా కలిగిస్తుందని నా నమ్మకం. 

ఎన్‌.లింగుస్వామి:   నేను కమల్‌గారి అభిమానిగా ఇక్కడికి వచ్చాను తప్ప నిర్మాతగా కాదు. సినిమాకి సంబంధించిన ప్రతి విషయం ఆయనకు తెలుసు. అందుకే ఈ సినిమా విషయంలో నేను నాకు ఎలాంటి టెన్షన్‌ లేదు. కమల్‌హాసన్‌గారి టాప్‌ టెన్‌ మూవీస్‌లో ‘ఉత్తమ విలన్‌’ చిత్రం నిలుస్తుందని రమేష్‌ అరవింద్‌ చెప్పారు. మా బేనర్‌ వేల్యూని మరింత పెంచే సినిమా అవుతుంది. అందరిలాగే నేను కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. 

సి.కళ్యాణ్‌: కమల్‌హాసన్‌గారితో సినిమా చెయ్యడం అంటే దేవుడు వరమిచ్చినట్టుగానే భావిస్తున్నాను. ఆయన చేసిన సినిమా ఎలా వుంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నలుగురు పద్మశ్రీలు కలిసి చేసిన సినిమా ఇది. విడుదలైన తర్వాత అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటారు. డెఫినెట్‌గా చాలా పెద్ద హిట్‌ అవుతుంది.

ఎస్‌.పి.బాలు: నన్ను కమల్‌ అన్నయ్యా అని పిలుస్తాడు. నేను, కమల్‌ వేరు కాదు. ఇద్దరం ఒకటే. తను నటించిన 120 సినిమాలకు అతనికి డబ్బింగ్‌ చెప్పాను. విశ్వరూపం నుండి తనే డబ్బింగ్‌ చెప్పుకుంటున్నాడు. అతనితో సినిమాలు తియ్యాలని ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. అలాంటిది శుభసంకల్పం సినిమాకి పిలిచి డేట్స్‌ ఇచ్చాడు. అతను ఏది చేసినా ఎక్స్‌ట్రార్డినరీగానే వుంటుంది. ఇండియన్‌ సినిమాలో కమల్‌ చేసిన క్యారెక్టర్స్‌, అతను చేసిన విడ్డూరాలు, వింతలు, నెక్స్‌ట్‌ చేయబోయే సినిమా భవిష్యత్‌లో ఎవరూ చెయ్యలేరు. 

శృతిహాసన్‌: నాన్నగారు చేసిన సినిమా ఆడియో ఫంక్షన్‌కి రావడం చాలా హ్యాపీగా వుంది. ఈ సినిమా చూశాను. చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వుంటుంది. జిబ్రాన్‌ మ్యూజిక్‌ అమేజింగ్‌. ఈ సినిమా ఘనవిజయం సాధించి అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటూ యూనిట్‌లోని అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement