Advertisement

‘రుద్రమదేవి’ థియేట్రికల్‌ ట్రైలర్‌ లాంచ్‌

Sun 01st Mar 2015 02:06 AM
rudrama devi,rudrama devi trailer,anushka,gunasekhar,ilaiyarja  ‘రుద్రమదేవి’ థియేట్రికల్‌ ట్రైలర్‌ లాంచ్‌
‘రుద్రమదేవి’ థియేట్రికల్‌ ట్రైలర్‌ లాంచ్‌
Advertisement

అగ్ర కథానాయిక అనుష్క టైటిల్‌ రోల్‌లో గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకంపై శ్రీమతి రాగిణీి గుణ సమర్పణలో డైనమిక్‌ డైరెక్టర్‌ దర్శక నిర్మాతగా రూపొందుతున్న భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ 3డి చిత్రం ‘రుద్రమదేవి’. ఈ చిత్రానికి సంబంధించిన 3డి థియేట్రికల్‌ ట్రైలర్‌ ప్రీమియర్‌ను శనివారం హైదరాబాద్‌లోని ఐమాక్స్‌ థియేటర్‌లో విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను హీరోయిన్‌ అనుష్క లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా..

అనుష్క: నేను ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ఇది. గుణశేఖర్‌గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఒక అద్భుతమైన సినిమాని ప్రేక్షకులకు అందించబోతున్నారు. రుద్రమదేవిగా నటించడం నేనెంతో గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. ఇంతకుముందు నేను చేసిన సినిమాలను ఎంతో ఆదరించిన ప్రేక్షకులు ఈ చిత్రాన్ని కూడా ఆదరించి సక్సెస్‌ చేస్తారని ఆశిస్తున్నాను.

గుణశేఖర్‌: భారతదేశంలోనే మొట్టమొదటి స్టీరియోస్కోపిక్‌ 3డి చిత్రంగా ‘రుద్రమదేవి’ని నిర్మించడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా కోసం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చాం. ఫైనల్‌గా మీ అందరికీ నచ్చే ఒక మంచి సినిమాని రూపొందించాం. ఈ సమ్మర్‌ ప్రారంభంలోనే మా ‘రుద్రమదేవి’ని మీ ముందుకు తీసుకువస్తాం. 

రుద్రమదేవిగా అనుష్క నటిస్తున్న ఈ ప్రెస్టీజియస్‌ మూవీలో గోనగన్నారెడ్డిగా స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌, రానా, కృష్ణంరాజు, సుమన్‌,   ప్రకాష్‌రాజ్‌, నిత్యమీనన్‌, కేథరిన్‌, ప్రభ,  జయప్రకాష్‌రెడ్డి,  ఆదిత్య మీనన్‌, ప్రసాదాదిత్య, అజయ్‌, విజయ్‌కుమార్‌, వేణుమాధవ్‌, ఉత్తేజ్‌, వెన్నెల కిషోర్‌, కృష్ణభగవాన్‌, ఆహుతి ప్రసాద్‌, చలపతిరావు, శివాజీరాజా, సమ్మెట గాంధీ, ఆదితి చెంగప్ప, సన, రక్ష తదితర నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మేస్ట్రో ఇళయరాజా, ఆర్ట్‌: పద్మశ్రీ తోట తరణి, ఫోటోగ్రఫీ: అజయ్‌ విన్సెంట్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: నీతా లుల్లా(జోధా అక్బర్‌ ఫేం), ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌,  వి.ఎఫ్‌.ఎక్స్‌. సూపర్‌వైజర్‌: కమల్‌ కణ్ణన్‌(ప్రసాద్‌ ఇ.ఎఫ్‌.ఎక్స్‌.), మాటలు: పరుచూరి బ్రదర్స్‌, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఫైట్స్‌: విజయ్‌, కాస్ట్యూమ్స్‌: వి.సాయిబాబు, మేకప్‌: రాంబాబు, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బెజవాడ కోటేశ్వరరావు,  ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కె.రామ్‌గోపాల్‌, సమర్పణ: శ్రీమతి రాగిణీ గుణ,  కథ`స్క్రీన్‌ప్లే`నిర్మాత`దర్శకత్వం: గుణశేఖర్‌. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement