Advertisement

‘మొహబ్బత్‌ మే’ ఆడియో రిలీజ్‌

Sun 15th Feb 2015 11:03 AM
telugu movie mohabbathmein,mahesh surya,meenakshi bhujang,rama ravishankar,bellamkonda suresh  ‘మొహబ్బత్‌ మే’ ఆడియో రిలీజ్‌
‘మొహబ్బత్‌ మే’ ఆడియో రిలీజ్‌
Advertisement

కార్తీక్‌, హమీద హీరోహీరోయిన్లుగా బేబి ఆకృతి సమర్పణలో ఆశ్రిత్‌ మూవీస్‌ పతాకంపై మహేష్‌ సూర్య దర్శకత్వంలో రమా రవిశంకర్‌ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మొహబ్బత్‌ మే..!’. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ శనివారం హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్‌లో జరిగింది. ఈ ఆడియోను సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ ఆవిష్కరించారు. మీనాక్షి భుజంగ్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా విడుదలైంది. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో కార్తీక్‌, దర్శకుడు మహేష్‌ సూర్య, నిర్మాతలు రవిశంకర్‌, రమాదేవి, కెమెరామెన్‌ శ్రీకాంత్‌ చిలుముల, సింగర్స్‌ ఐశ్వర్య, ప్రీతి, గేయరచయితలు పోలూరు, విజయేంద్ర, ఆదిత్య మ్యూజిక్‌ నిరంజన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

బెల్లంకొండ సురేష్‌: తెలుగు టైటిల్స్‌తో కాకుండా ఈమధ్య హిందీ టైటిల్స్‌తో వస్తున్న సినిమాలు కూడా హిట్‌ అవుతున్నాయి. ఈ చిత్రానికి మొహబ్బత్‌మే అనే హిందీ టైటిల్‌ పెట్టారు. ఈ సినిమా పాటలు, సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. యూనిట్‌లోని అందరికీ ఆల్‌ ది బెస్ట్‌.

రవిశంకర్‌: కొత్త ఆర్టిస్టులతో సినిమా చేసినప్పటికీ 6 నెలల్లో కంప్లీట్‌ చేశాం. వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఈరోజు ఆడియోను రిలీజ్‌ చేస్తున్నాం. అమ్మ ప్రేమ గురించి చెప్పే సినిమా ఇది. ఒక కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. మార్చి మొదటి వారంలో ఈచిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం. 

మీనాక్షి భుజంగ్‌: ఈ సినిమాకి మ్యూజిక్‌ చేసే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు నా థాంక్స్‌. ఇందులోని పాటలన్నీ బాగా వచ్చాయి. ముఖ్యంగా అమ్మపై చేసిన పాట ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఈ పాటలు విని హిట్‌ చేయడమే కాకుండా సినిమాని కూడా పెద్ద హిట్‌ చేస్తారని ఆశిస్తున్నాను.

కార్తీక్‌: నా ఫస్ట్‌ మూవీ ఆడియో ఫంక్షన్‌ జరపుకోవడం చాలా ఎక్సైట్‌గా వుంది. ఈ సినిమాలో నేను బాగా పెర్‌ఫార్మ్‌ చెయ్యడానికి డైరెక్టర్‌గారు చాలా హెల్ప్‌ చేశారు. నా ఫ్రెండ్స్‌గా నటించిన వారు కూడా నాకు చాలా కోఆపరేట్‌ చేశారు. ఈ సందర్భంగా అందరికీ థాంక్స్‌ చెప్తున్నాను.

మహేష్‌ సూర్య: మా నిర్మాతగారి పూర్తి సహకారంతో సినిమాని చాలా అద్భుతంగా చేశాం. మీనాక్షి భుజంగ్‌తో నాకు ఐదు సంవత్సరాల పరిచయం వుంది. ఈ సినిమా కోసం చాలా మంచి మ్యూజిక్‌ చేశాడు. ఎన్నో  వ్యయప్రయాసలకోర్చి చెన్నైలోని ఎ.ఆర్‌.రెహమాన్‌ థియేటర్‌లో ఎంతో క్వాలిటీగా ఈ పాటలు రికార్డ్‌ చేయించాం. రవిశంకర్‌గారు నేను చెప్పిన బడ్జెట్‌ కంటే ఎక్కువైనప్పటికీ ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా చాలా క్వాలిటీగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించి మా అందరికీ పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement