Advertisement

'నిన్నే కోరుకుంటా' చిత్రం ప్రారంభం..!

Fri 30th Jan 2015 04:28 AM
ninne korukunta cinema,ganamurali saragadam,maripi vidhyasagar  'నిన్నే కోరుకుంటా' చిత్రం ప్రారంభం..!
'నిన్నే కోరుకుంటా' చిత్రం ప్రారంభం..!
Advertisement

శుభకారి క్రియేషన్స్ పతాకంపై తుమ్మల నవ్య మరియు నిత్య సమర్పిస్తున్న సినిమా ''నిన్నే కోరుకుంటా''. దర్శకుడు గణమురళి శరగడం. నిర్మాత మరిపి విద్యాసాగర్. విజయ భాస్కర్, వివేక్, ఆనంద్, పూజిత, వైజాగ్ ప్రసాద్, పూర్ణిమ, సారిక, ప్రదీప్, సత్యం రాజేష్, సుమన్ శెట్టి, కొండవలస, సంజన, అంబటి శ్రీను, ప్రసాద్ చౌదరి ప్రధాన తారాగణం. ఈ చిత్ర ప్రారంభోత్సవం జనవరి 30 న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. ఈ చిత్ర ముహూర్తానికి ప్రముఖ దర్శకురాలు బి.జయ క్లాప్ ను ఇవ్వగా, నిర్మాత కె.కె.రాధామోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. బి.గోపాల్ మొదటి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

చిత్ర ప్రారంభోత్సవ సందర్భంగా దర్శకుడు గణమురళి శరగడం మాట్లాడుతూ "తెలుగు లో సంధ్య అనే సందేశాత్మకమైన చిత్రాన్ని తీశాను. కాని ఆ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రేక్షకులు ఎలాంటి సినిమాను ఆదరిస్తారో తెలుసుకొని ఈ సినిమా కథ రాసుకున్నాను. ఈ సినిమా చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. శుభకారి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న మొదటి సినిమా ఇది. ఖచ్చితంగా ఈ సినిమా అందరికి నచ్చుతుంది" అని అన్నారు.

నిర్మాత మరిపి విద్యాసాగర్ మాట్లాడుతూ "ఈ సినిమా కథ నచ్చి మొదటిసారిగా తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టాను. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని మే రెండవ వారంలో విడుదల చేస్తాము" అని చెప్పారు.

లీడ్ రోల్ చేస్తున్న విజయ్ భాస్కర్ మాట్లాడుతూ "ఇప్పటి వరకు నేను నెగెటివ్ పాత్రలలో ఎక్కువగా కనిపించాను. ఇప్పుడు ఓ మంచి పాత్రలో నటించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని చెప్పారు.

ఆనంద్ మాట్లాడుతూ "మనుషులతో జాగ్రత్త అనే సినిమాలో హీరోగా నటించాను. మళ్ళీ ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటించడానికి అవకాశం రావడం నా అద్రుష్టం. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా" అని చెప్పారు.

వివేక్ మాట్లాడుతూ "ఇది ఓ రొమాంటిక్ కామెడీ సినిమా. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది" అని అన్నారు.

హీరోయిన్ పూజిత మాట్లాడుతూ "ఇది నా మొదటి సినిమా. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కి నిర్మాతకు థాంక్స్ చెప్పుకుంటున్నాను" అని అన్నారు.

వైజాగ్ ప్రసాద్ మాట్లాడుతూ "ఈ సినిమా లో నాది ఓ కోటీశ్వరుని పాత్ర. నువ్వునేను సినిమాలో నా పాత్రకు ఇది దగ్గరగా ఉంటుంది" అని అన్నారు.

ప్రీతీ నిగమ్ మాట్లాడుతూ "ఈ సినిమాలో మదర్ రోల్ లో నటించబోతున్నాను. పాత్ర ఏది అనేది కాదు ఎంత స్కోప్ ఉంది అనేది ముఖ్యం. ఈ పాత్ర నా కెరీర్ కి ప్లస్ పాయింట్ అవుతుంది" అని చెప్పారు.

ఈ చిత్రానికి సంగీతం: ప్రణవ్, ఎడిటింగ్: నందమూరి హరి, పాటలు: పోతుల రవికిరణ్, కులశేఖర్, మాటలు: సాహు, ప్రకాష్, మాధవ్. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement