Advertisement

‘టెంపర్‌’ ఆడియో ఫంక్షన్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

Thu 29th Jan 2015 03:38 AM
temper audio release,ntr movie temper,director puri jagannath  ‘టెంపర్‌’ ఆడియో ఫంక్షన్‌ లైవ్‌ అప్‌డేట్స్‌
‘టెంపర్‌’ ఆడియో ఫంక్షన్‌ లైవ్‌ అప్‌డేట్స్‌
Advertisement

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో బండ్ల గణేష్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘టెంపర్‌’. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఈరోజు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరగనుంది. ‘ఆంధ్రావాలా’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించిన పూరి జగన్నాథ్‌కి ఎన్టీఆర్‌తో ఇది రెండో సినిమా. కాగా, ఎన్టీఆర్‌తో ‘బాద్‌షా’ చిత్రాన్ని నిర్మించిన బండ్ల గణేష్‌కి కూడా ఇది రెండో సినిమా. ఈమధ్య కాలంలో సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ ఇస్తూ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌లో ఒకడిగా పేరు తెచ్చుకున్న అనూప్‌ రూబెన్స్‌తో పూరి జగన్నాథ్‌కి ఇది రెండో సినిమా. ఎన్టీఆర్‌, అనూప్‌ రూబెన్స్‌ కాంబినేషన్‌లో వస్తోన్న మొదటి ఆడియో ఇది. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాదిగా అభిమానులు శిల్పకళావేదికకు చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ‘టెంపర్‌’ ఆడియో ఫంక్షన్‌ లైవ్‌ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ‘సినీజోష్‌’ ప్రత్యేకంగా అందిస్తోంది.

ఈ ఫంక్షన్‌కి సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్‌కై ‘సినీజోష్‌’ను చూస్తూనే వుండండి...

ముందుగా ఈ చిత్రం ఆడియో ఆల్బమ్‌లోని ట్రాక్‌ లిస్ట్‌ని పరిశీలిద్దాం..

‘టెంపర్‌’ ఆడియో ఆల్బమ్‌లోని మొదటి పాట ‘చూలేంగే ఆస్‌మే..’ ఈ పాటను విశ్వ రచించగా, అద్నన్‌ సమి, రమ్య బెహరా, వీణా ఘంటసాల గానం చేశారు. టెంపర్‌ టైటిల్‌ సాంగ్‌గా వచ్చే ‘టెంపర్‌..’ను భాస్కరభట్ల రచించగా, ర్యాప్‌ వెర్షన్‌ను రాహుల్‌ అందించారు. ఉమా నేహా, ఎం.ఎల్‌.ఆర్‌.కార్తికేయన్‌, భార్గవి పిళ్ళై, సింహా ఈ పాటను గానం చేశారు. మూడో పాటగా వచ్చే ‘దేవుడా..’ను భాస్కరభట్ల రచించగా, అనూప్‌ రూబెన్స్‌, పూరి జగన్నాథ్‌ పాడారు. నాలుగో పాట ‘ఒన్‌ మోర్‌ టైమ్‌’. ఈ పాటకు కందికొండ సాహిత్యాన్ని అందించారు, రంజిత్‌, లిప్సిక గానం చేశారు. ఐదో పాట ‘ఇట్టాగే రెచ్చిపోదాం..’. ఈ పాటను భాస్కరభట్ల రచించగా, గీతా మాధురి, ధనుంజయ్‌, అనుదీప్‌, అరుణ్‌ పాడారు. ఆరోపాటగా థీమ్‌ మ్యూజిక్‌ వుంటుంది. దీన్ని హైమత్‌, అనుదీప్‌, అరుణ్‌, ధనుంజయ్‌ గానం చేశారు. 

ఇప్పుడే ఉదయభాను యాంకరింగ్‌తో ‘టెంపర్‌’ ఆడియో ఫంక్షన్‌ స్టార్ట్‌ అయింది. పల్లవి అకాడమీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ పి.బి.కృష్ణభారతి స్టూడెంట్‌ వైష్ణవి క్లాసికల్‌ నృత్యంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

క్లాసికల్‌ డాన్స్‌ తర్వాత ఎన్టీఆర్‌ చిత్రాల్లోని సూపర్‌హిట్‌ సాంగ్స్‌తో కూడిన మిడ్లీ ప్రారంభమైంది. ఈ మిడ్లీని శ్రీధర్‌ డాన్స్‌ ట్రూప్‌ పెర్‌ఫార్మ్‌ చేస్తోంది. 

ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి ఛార్మి, జెమిని కిరణ్‌, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, డి.సురేష్‌బాబు, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, సుకుమార్‌, వక్కంతం వంశీ, ఫైట్‌మాస్టర్‌ విజయ్‌, పోసాని కృష్ణమురళిలతోపాటు చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్‌, సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ హాజరయ్యారు. 

ఇప్పుడే పరమేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బేనర్‌లో రూపొందిన చిత్రాలకు సంబంధించిన స్పెషల్‌ ఆడియో విజువల్‌ను ప్రదర్శించారు. అనంతరం ఎన్టీఆర్‌ సూపర్‌హిట్‌ సాంగ్స్‌తో కూడిన మరో మిడ్లీని పెర్‌ఫార్మ్‌ చేస్తోంది శ్రీధర్‌ డాన్స్‌ ట్రూప్‌.

ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న కాజల్‌ అగర్వాల్‌కు సంబంధించిన ఆడియో విజువల్‌ ప్రదర్శింపబడుతోంది. 

8.16

ప్రముఖ నిర్మాత ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి మొదటి పాట ‘ఒన్‌ మోర్‌ టైమ్‌’ను రిలీజ్‌ చేశారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త జయంత్‌ కూడా పాల్గొన్నారు.

శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘అన్ని క్యారెక్టర్స్‌ అందరూ చెయ్యలేరు. కొందరే చెయ్యగలరు. అప్పట్లో కృష్ణుడైనా, దుర్యోధనుడైనా అప్పట్లో ఎన్‌.టి.రామారావుగారికే సాధ్యం అనిపించేలా నటించేవారు. ఇప్పుడు అలాంటి క్యారెక్టర్స్‌ చెయ్యడం ఆ మహానటుడి మనవడు ఎన్టీఆర్‌వల్లే సాధ్యం. టైటిల్‌కి తగ్గట్టు ఎన్టీఆర్‌ ఫిజిక్‌ని, బాడీ లాంగ్వేజ్‌ని మార్చారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్‌ అవుతుంది’’ అన్నారు.  

జయంత్‌ మాట్లాడుతూ ‘‘ఎన్టీఆర్‌ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన యాక్టింగ్‌ అంటే మరీ ఇష్టం. ఈమధ్యకాలంలో ఆయనకి మంచి హిట్‌ రాలేదు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్‌ కావాలని తిరుపతి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని కోరుకున్నాను’’ అన్నారు.  

8.26 

ప్రముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు, ప్రముఖ పారిశ్రామికవేత్త రంజిత్‌రెడ్డి ‘చూలేంగే ఆస్‌మే’ పాటను ఆవిష్కరించారు. 

కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ ‘‘గణేష్‌ చిన్నప్పటి నుంచి మా దగ్గరే పెరిగాడు. ఇప్పుడు చాలా పెద్ద నిర్మాత అయ్యాడు. ఎప్పుడూ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అంటూ వుంటాడు. అలాగే బ్లాక్‌బస్టర్‌ హిట్సే నిర్మించారు. పూరి జగన్నాథ్‌ చాలా టెంపర్‌మెంట్‌తో సినిమాలు తీస్తాడు. వెరైటీ కమర్షియల్‌ సినిమాలు తియ్యాలంటే పూరి జగన్నాథ్‌ తర్వాతే ఎవరైనా. ఈ డిఫరెంట్‌ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్‌ అవుతుంది’’ అన్నారు.

అనంతరం ‘చూలేంగే ఆస్‌మే’ పాటను సింగర్స్‌ లైవ్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇవ్వగా, పాటకు అనుగుణంగా డాన్స్‌ పెర్‌ఫార్మ్‌ చేశారు. దీని తర్వాత సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌కి సంబంధించిన ఆడియో విజువల్‌ను ప్రదర్శించారు. 

ఇప్పుడే ‘టెంపర్‌’ హీరో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రేక్షకుల, అభిమానుల హర్షధ్వానాల మధ్య ఫంక్షన్‌కు హాజరయ్యారు. 

8.47

ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్‌ ‘ఇట్టాగే రెచ్చిపోదాం..’ అనే మూడో పాటను ఆవిష్కరించారు.

8.47

ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్‌ ‘ఇట్టాగే రెచ్చిపోదాం..’ అనే మూడో పాటను ఆవిష్కరించారు. భాస్కరభట్ల కూడా పాల్గొన్నారు. 

భాస్కరభట్ల మాట్లాడుతూ ‘‘ఐటమ్‌ సాంగ్స్‌ మీద ఐటమ్‌ సాంగ్‌ రాస్తే ఎలా వుంటుంది అని పూరి జగన్నాథ్‌గారు ఇచ్చిన ఐడియాతో రాశాను. నెక్స్‌ట్‌ నేను రాసిన పాట టెంపర్‌ రేగ్గొట్టే పాట అది. యంగ్‌ టైగర్‌ ఫాన్స్‌ కోసం ఒక మాస్‌ సాంగ్‌ వుండాలి తమ్ముడు అని చెప్పారు. నేను, అనూప్‌ కూర్చొని చేసిన పాట. డెఫినెట్‌గా నేల, బెంచి ఆడియన్స్‌తో విజిల్‌ వేయించే పాట’’ అన్నారు. అనంతరం ఈ పాటను శ్రీధర్‌ డాన్స్‌ ట్రూప్‌ పెర్‌ఫార్మ్‌ చేశారు 

ఇప్పుడు డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ చిత్రాలకు సంబంధించిన ఒక ఆడియో విజువల్‌ను ప్రదర్శిస్తున్నారు.

9.00

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ చేతులమీదుగా నాలుగో పాటగా ‘టెంపర్‌..’ టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేశారు.

సుకుమార్‌ మాట్లాడుతూ ‘‘మీ అందరి కన్నా నేను చాలా స్పెషల్‌. ఎందుకంటే మీ కంటే ముందే సినిమా చూసేశాను. కొన్ని సీన్స్‌ చూపించారు. చాలా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత స్వచ్ఛమైన పెర్‌ఫార్మెన్స్‌ చూశాను. నిజాయితీతో కూడిన పెర్‌ఫార్మెన్స్‌ చూశాను. పూరిగారు ఒన్‌ వీక్‌ రాస్తే హిట్‌, టూ వీక్స్‌ రాస్తే సూపర్‌హిట్‌ అంటారు. అయితే ఈ సినిమాకి ఫోర్‌ వీక్స్‌ రాశారట. కాబట్టి ఇది సూపర్‌ డూపర్‌ హిట్‌ అవుతుంది’’ అన్నారు. 

దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘తాత కొండవీటి సింహం, బాబాయ్‌ రౌడీ ఇన్‌స్పెక్టర్‌, అన్నయ్య పటాస్‌, తమ్ముడు టెంపర్‌. ఇది అభిమానులకు పండగ సినిమా. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ని ఎంత కొత్తగా చూపించాలో అంత కొత్తగా చూపించారు పూరి జగన్నాథ్‌’’ అన్నారు. ఈ పాటను సింగర్స్‌ లైవ్‌ పెర్‌ఫార్మ్‌ చెయ్యగా, శ్రీధర్‌ డాన్స్‌ ట్రూప్‌ డాన్స్‌ పెర్‌ఫార్మ్‌ చేసింది.

9.18

హీరోయిన్‌ ఛార్మి, ప్రముఖ నిర్మాత అంబికా రామచంద్రరావు ఐదోపాట, చివరి పాట ‘దేవుడా..’ను ఆవిష్కరించారు. 

ఛార్మి మాట్లాడుతూ ‘‘నేను కూడా ఈ సినిమాలోని కొన్ని సీన్స్‌ పాటలు చూశాను. చాలా బాగున్నాయి. తప్పకుండా ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది’’ అన్నారు. 

అంబికా రామచంద్రరావు మాట్లాడుతూ ‘‘గణేష్‌గారు నిర్మాతగా ఎన్టీఆర్‌గారు యాక్ట్‌ చేసిన బాద్‌షా చాలా పెద్ద హిట్‌ అయింది. అదే సెంటిమెంట్‌ ఈ సినిమాకి కూడా కొనసాగుతుంది అనుకుంటున్నాను. ఆల్‌ ద బెస్ట్‌ ఫర్‌ ఎంటైర్‌ టీమ్‌’’ అన్నారు. అనంతరం అనూప్‌ రూబెన్స్‌ ఈ పాటను లైవ్‌గా పెర్‌ఫార్మ్‌ చేశారు. 

ఇప్పుడు హీరో ఎన్టీఆర్‌కు సంబంధించిన ఆడియో విజువల్‌ ప్రదర్శింపబడుతోంది. 

9.35

పి.వి.పి. సినిమా అధినేత పొట్లూరి వి. ప్రసాద్‌, రచన టెలివిజన్‌ ప్రై. లిమిటెడ్‌ అధినేత నరేంద్రనాథ్‌ చౌదరి ‘టెంపర్‌’ ట్రైలర్‌ను ఆవిష్కరించారు.

9.45

ఈ ఆడియో ఫంక్షన్‌కి విచ్చేసిన అతిథులు, చిత్ర యూనిట్‌ సభ్యులు వేదికపైకి విచ్చేశారు. ‘టెంపర్‌’ ఆడియోను వి.వి.వినాయక్‌, నరేంద్రనాధ్‌ చౌదరి ఆవిష్కరించి తొలి సి.డి.ని నందమూరి కళ్యాణ్‌రామ్‌కి అందించారు. ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా ఈ ఆడియో విడుదలైంది. 

నిర్మాత బండ్ల గణేష్‌ మాట్లాడుతూ ‘‘ఎన్టీఆర్‌ నా బాద్‌షా. ఆ సినిమా షూటింగ్‌ జరుగుతున్న టైమ్‌లో ఆ సినిమా తర్వాత రెండు సినిమాలు కమిట్‌ అయి వున్నాను. తప్పకుండా ఆ రెండు సినిమాల తర్వాత మళ్ళీ సినిమా చేద్దాం అన్నారు. ఏదో సరదాగా అన్నారనుకున్నాను. కానీ, అన్నట్టుగానే ఈ సినిమా స్టార్ట్‌ అయింది. ఈ సినిమా ఇద్దరి కోసం హిట్‌ అవ్వాలి. అది మా అమ్మ, నాన్న. ఎన్టీఆర్‌కి హిట్లు కొత్త కాదు, పూరిగారికి హిట్లు కొత్త కాదు, మా బేనర్‌కి కూడా హిట్లు కొత్త కాదు. కానీ, మా అమ్మా నాన్న కోసం ఈ సినిమా సూపర్‌హిట్‌ అవ్వాలి. ఈ సినిమా చూసిన మా అన్నయ్య ఇది ఎవరికీ అమొద్దు మనమే రిలీజ్‌ చేద్దాం అన్నాడు. సినిమా మీద మేం అంత కాన్ఫిడెంట్‌గా వున్నాం. ఎన్టీఆర్‌ కెరీర్‌లో, పూరిగారి కెరీర్‌లో, మా బేనర్‌ కెరీర్‌లో ఇది పెద్ద హిట్‌ సినిమా అవుతుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 13న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు.

పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకి ఒక కథ అనుకున్నాం. అది తారక్‌కి కూడా నచ్చింది. షూటింగ్‌కి వెళ్ళే టైమ్‌లో వక్కంతం వంశీ ఒక కథ చెప్పాడు. బాగుంది. చేస్తావా అని అడిగాడు తారక్‌. కథ బాగుంటే ఎవరిదైనా చేస్తాను అని చెప్పాను. నిజంగానే వంశీ చెప్పిన కథ చాలా బాగుంది. అలా ఈ సినిమా స్టార్ట్‌ అయింది. 2004లో ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో నేను చేసిన ఆంధ్రావాలా ఫ్యాన్స్‌ని బాగా డిజప్పాయింట్‌ చేసింది. ఇప్పుడు 2015లో టెంపర్‌. నన్ను నమ్మండి. ఈ సినిమా చూసిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాలు తారక్‌ చేసిన సినిమాలు మర్చిపోతారు. ఇప్పటివరకు మీరు చూసిన ఎన్టీఆర్‌ కాదు. కొత్త నందమూరి తారకరామారావు ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాతో తారక్‌ ఎక్కడో వుంటాడు’’ అన్నారు.

వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ ‘‘పటాస్‌ హిట్‌తో ఎనర్జీ పెరిగింది. టెంపర్‌తో అది రెట్టింపు అవుతుంది. పూరి చెప్పినట్టు ఈ సినిమాలో కొత్త ఎన్టీఆర్‌ కనిపిస్తున్నాడు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్‌ అవుతుంది. గణేష్‌ చెప్పినట్టు వాళ్ళ అమ్మ నాన్న కోసం ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

కళ్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో ఓ డైలాగ్‌ వుంది. దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర. నిజమే ఇది నందమూరి సినిమాల దండయాత్ర. పటాస్‌ తర్వాత తమ్ముడి టెంపర్‌, ఆ తర్వాత బాబాయ్‌ లయన్‌ డెఫినెట్‌గా ఇది నందమూరి సంవత్సరం అవుతుంది’’ అన్నారు.

కాజల్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ ‘‘పాటలు చాలా చాలా బాగున్నాయి. అనూప్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ చేశాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ చాలా హాట్‌గా కనిపిస్తారు. ఇది మా కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ మూవీ అవుతుంది. అలాగే గణేష్‌గారి బేనర్‌లో కూడా ఇది హ్యాట్రిక్‌ మూవీ అవుతుంది’’ అన్నారు.

ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ` ‘‘ఈమధ్య నేను చేసిన రెండు, మూడు సినిమాలు మిమ్మల్ని నిరాశపరిచాయి. ఈ సినిమా నేను ఇష్టంతో చేయలేదు. కసితో చేశాను. మీకు నచ్చకపోయినా ఫర్వాలేదు. ఇది కాకపోతే మరొకటి. అలా మీకు నచ్చేవరకూ చేస్తూనే వుంటాను. నందమూరి అభిమానులు కాలర్‌ ఎత్తుకొని తిరిగే వరకూ సినిమాలు చేస్తూనే వుంటాను. మొదటి కోరిక జనవరిలో తీరింది. వచ్చే నెల టెంపర్‌ వస్తోంది. తర్వాత బాబాయ్‌ చేసిన లయన్‌ రిలీజ్‌ అవుతోంది. ఇది నందమూరి నామ సంవత్సరం కావాలని అభిమానులతోపాటు నేను కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి ఆశీస్సుల కోసం అర్థిస్తున్నాను’’ అన్నారు.  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement