Advertisement

‘తాగుబోతు’ మూవీ లోగో లాంచ్‌

Sun 25th Jan 2015 08:39 AM
thagubothu movie logo launch,telugu and kannada movie thagubothu  ‘తాగుబోతు’ మూవీ లోగో లాంచ్‌
‘తాగుబోతు’ మూవీ లోగో లాంచ్‌
Advertisement

తాగుబోతు రమేష్‌ హీరోగా, మేఘనా పటేల్‌ హీరోయిన్‌గా బి.ఎన్‌.ఎం. కంబైన్స్‌ పతాకంపై త్రిశూల్‌ దర్శకత్వంలో ఎన్‌.ఎం.కాంతారాజ్‌ తెలుగు, కన్నడ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం ‘తాగుబోతు’. ఆర్‌జివి అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రం జనవరి 27న ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ లోగోను, బ్రోచర్‌ను ఆదివారం హైదరాబాద్‌లోని కెన్స్‌ హోటల్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హీరో తాగుబోతు రమేష్‌, హీరోయిన్‌ మేఘనా పటేల్‌, దర్శకుడు త్రిశూల్‌, నిర్మాత ఎన్‌.ఎం.కాంతారాజ్‌, సినిమాటోగ్రాఫర్‌ సినీటెక్‌ సూరి పాల్గొన్నారు. 

తాగుబోతు రమేష్‌: తాగుబోతు అనే టైటిల్‌తోనే నేను నటుడుగా ఎంతో పేరు తెచ్చుకున్నాను. ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరించారు. ఆమధ్య నేను ‘ఏకేరావు, పీకేరావు’ చిత్రంలో ఇద్దరు హీరోల్లో ఒక హీరోగా నటించాను. ఈ సినిమాలో నేను సోలో హీరోగా నటిస్తున్నాను. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న మేఘనా పటేల్‌ నా పక్కన ఎలాంటి ఫీలింగ్స్‌ లేకుండా నటించడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీకి కూడా వెళ్తున్నందుకు ఆనందంగా వుంది.

మేఘనా పటేల్‌: ఇది ఫస్ట్‌ మూవీ. ఈ సినిమాలో రమేష్‌గారితో కలిసి నటించడం చాలా హ్యాపీగా వుంది. డైరెక్టర్‌ త్రిశూల్‌గారు చెప్పిన సబ్జెక్ట్‌ నాకు చాలా బాగా నచ్చింది. నా ఫస్ట్‌ మూవీతోనే తెలుగు, కన్నడ ప్రేక్షకులకు పరిచయమవుతున్నందుకు సంతోషంగా వుంది. 

త్రిశూల్‌: తెలుగులో నాకు ఇది తొలి సినిమా. కన్నడలో ఆల్రెడీ రెండు సినిమాలు డైరెక్ట్‌ చేశాను. ఈ సినిమాని తెలుగు, కన్నడలో చేస్తున్నప్పటికీ రెండు కథలు వేరు. ఒకదానికి ఒకటి సంబంధం లేని కథ. అయితే హీరో హీరోయిన్లు మాత్రమే రెండు భాషల్లో కామన్‌గా వుంటారు. మిగతా ఆర్టిస్టులు ఆయా భాషల్లోని వారు నటిస్తారు. తాగుడు వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయి, మనిషి ఏవిధంగా పాడవుతాడు అనే మంచి మెసేజ్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నాము. తప్పకుండా ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. 

ఎన్‌.ఎం.కాంతారాజ్‌: తమిళ్‌లో కరుణాస్‌తో ఒక సినిమా నిర్మించాను. నా రెండో సినిమాగా ఏది చేస్తే బాగుంటుందని అనుకున్నప్పుడు త్రిశూల్‌గారు ఈ కథ చెప్పారు. నాకు బాగా నచ్చింది. వెంటనే ప్రాజెక్ట్‌ ఓకే చేశాను. ఈనెల 27న ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం.

ఆలీ, పృథ్వి, రఘుబాబు, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, జీవా, అవినాష్‌, షకీలా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఓంకార్‌ త్యాగరాజ్‌, కెమెరా: సినీటెక్‌ సూరి, ఎడిటింగ్‌: నాగేంద్ర, పాటలు: భాస్కరభట్ల, నిర్మాత: ఎన్‌.ఎం.కాంతరాజ్‌, దర్శకత్వం: త్రిశూల్‌. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement