Advertisement

జనవరి 30న ‘టాప్‌ ర్యాంకర్స్‌’

Sun 25th Jan 2015 06:57 AM
top rankers,top rankers movie release date,january 30th,gollapati nageswara rao  జనవరి 30న ‘టాప్‌ ర్యాంకర్స్‌’
జనవరి 30న ‘టాప్‌ ర్యాంకర్స్‌’
Advertisement

డా॥ రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రలో విశ్వ విజన్‌ ఫిలింస్‌ పతాకంపై గోళ్ళపాటి నాగేశ్వరరావు దర్శకత్వంలో పసుపులేటి బ్రహ్మం నిర్మించిన మెసేజ్‌ ఓరియంటెడ్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘టాప్‌ ర్యాంకర్స్‌’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో త్రిశూల్‌, సాగరిక,  నటుడు అశోక్‌కుమార్‌, దర్శకుడు గోళ్ళపాటి నాగేశ్వరరావు, నిర్మాత పసుపులేటి బ్రహ్మం, సంగీత దర్శకుడు జయసూర్య తదితరులు పాల్గొన్నారు. 

పసుపులేటి బ్రహ్మం: దాదాపు ఏడాదిన్నర కష్టపడి ఈ సినిమా చేశాం. ఈనెల 30న రిలీజ్‌ చేస్తున్నాం. డైరెక్టర్‌ నాగేశ్వరరావుగారు చాలా చక్కగా తీశారు. రాజేంద్రప్రసాద్‌గారు బ్రహ్మాండంగా నటించారు. సెన్సార్‌ చేసిన ఆఫీసర్‌ కూడా తప్పకుండా ఈ సినిమాకి అవార్డు వస్తుందని ప్రశంసించారు. 

అశోక్‌కుమార్‌: ప్రస్తుతం ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌ ఎలా వుంది? ఎలా వుంటే బాగుంటుంది అని తెలియజెప్పే సినిమా ఇది. మంచి మెసేజ్‌తో తీసిన ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడాల్సిన అవసరం వుంది. 

జయసూర్య: మంచి సందేశంతో కూడిన ఈ సినిమాలో నాలుగు పాటలు వున్నాయి. ఆల్రెడీ ఈ పాటలు అందర్నీ అలరిస్తున్నాయి. ‘ర్యాంకుల రణరంగమా..’ అనే పాట నాకు చాలా మంచి పేరు తెచ్చింది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. 

సాగరిక: కెమెరా ముందు నిలబడాలంటే భయంగా వున్న నేను డైరెక్టర్‌గారి సపోర్ట్‌ వల్ల యాక్ట్‌ చెయ్యగలిగాను. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌గారులాంటి సీనియర్‌ ఆర్టిస్ట్‌తో కలిసి నటించడం నిజంగా నా అదృష్టం. 

త్రిశూల్‌: ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్‌. ఈ  సినిమాలో నటిస్తున్నప్పుడు నేను ఇంటర్‌ చదివే రోజులు గుర్తొచ్చాయి. కాలేజీలో వున్నన్ని రోజులు జైల్లో వున్న ఫీలింగ్‌ కలిగింది. నా మొదటి సినిమాలోనే రాజేంద్రప్రసాద్‌గారితో కలిసి నటించడం ఆనందాన్ని కలిగించింది. 

గోళ్ళపాటి నాగేశ్వరరావు: మనిషి మీద సినిమా ప్రభావం ఎంతో వుంటుంది. ప్రస్తుతం విద్య వ్యాపారంగా మారిపోయింది. దాన్ని కథా వస్తువుగా తీసుకొని ఈ సినిమా చెయ్యడం జరిగింది. ఎల్‌కెజి నుంచి ఎమ్‌సెట్‌ వరకు జరిగే జర్నీలో ఒక బ్రహ్మాండమైన పిల్లర్‌గా రాజేంద్రప్రసాద్‌గారు చాలా అద్భుతమైన క్యారెక్టర్‌ చేశారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇప్పటివరకు ఈ కథతో సినిమా రాలేదు. ఈ సినిమాలోని ఒక్క సీన్‌ అయినా మరో సినిమాలోని సీన్‌లా వుందని ఎవరైనా ప్రూవ్‌ చేస్తే వారికి లక్ష రూపాయలు బహుమతి ఇస్తాం. మా సినిమా మీద మాకు వున్న కాన్ఫిడెన్స్‌ వల్లే ఇలా చెప్తున్నాను. 

డా॥ రాజేంద్రప్రసాద్‌, అశోక్‌కుమార్‌, సోనీ చరిష్టా, శివాజీరాజా, గిరిబాబు, జెన్నీ, పసుపులేటి మణికంఠ, నరేష్‌, రాజేష్‌, త్రిశూల్‌, అశ్వని, సాగరిక, అనూష తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జయసూర్య, కెమెరా: శంకర్‌, ఎడిటింగ్‌: నాగిరెడ్డి, నిర్మాత: పసుపులేటి బ్రహ్మం, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: గోళ్ళపాటి నాగేశ్వరరావు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement