Advertisement

‘గాయకుడు’ చిత్రానికి క్లీన్‌ ‘యు’

Sat 24th Jan 2015 09:17 AM
telugu movie gayakudu,gayakudu got u certificate  ‘గాయకుడు’ చిత్రానికి క్లీన్‌ ‘యు’
‘గాయకుడు’ చిత్రానికి క్లీన్‌ ‘యు’
Advertisement

శ్రీమతి లక్ష్మీ సమర్పణలో యువదర్శకుడు కమల్‌. జి కి దర్శకత్వ అవకాశాన్ని ఇచ్చి, ధీరు ఫిలింస్‌ పతాకంపైన, నిర్మాత జమ్మలమడుగు రవీంద్రనాధ్‌ నిర్మించిన మ్యూజికల్‌ లవ్‌స్టోరీ ‘గాయకుడు’. దీనికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. ఫిబ్రవరి ప్రధమార్ధంలో విడుదల చేసేందుకు సర్వసన్నాహాలు జరుగుతున్నాయి. 

ఫిబ్రవరి ప్రథమార్ధంలో విడుదల

నిర్మాత జమ్మలమడుగు రవీంద్రనాధ్‌ సినిమా గురించి చెబుతూ..‘సెన్సార్‌ బోర్డ్‌ వారు మా చిత్రాన్ని చూసి ‘యు’ సర్టిఫికెట్‌ని ఇచ్చి యువతతో పాటు కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి చిత్రమని అన్నారు. ఇది మాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఈ చిత్రాన్ని దర్శకుడు కమల్‌, నేటి యువత కోరుకునే అన్ని అంశాల్ని పొందుపరిచి వెండితెరకు ఎక్కించారు. పాటలు పాడుతూ కొనసాగే ఓ యువకుడు, తన జన్మ రహాస్యాన్ని ఎలా తెలుసుకోగల్గుతాడు? అనే అంశాన్ని కథాంశంగా చేసుకుని..ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఫిబ్రవరి నెల మొదటివారంలో లేదా రెండవవారంలో ప్రేక్షకుల ముందుకు దీనిని తీసుకువస్తాము’.. అన్నారు. 

చిత్ర దర్శకుడు కమల్‌ మాట్లాడుతూ..‘ఇది యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ. ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా అల్రెడీ విడుదలైన ఆడియోకి మంచి స్పందన లభించింది. ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కోటి కుమారుడైన రోషన్‌ సాలూరిని సంగీత దర్శకుడిగా ఈ చిత్రం ద్వారా పరిచయం చేశాము. తను చక్కని స్వరాలతో 8 పాటలను అందించాడు. ఈ పాటలన్నీ కథానుసారంగానే ఉంటాయి. మా ‘గాయకుడు’ యువతని మాత్రమే కాదు, అన్ని తరగతుల వారిని అలరించే చిత్రం అవుతుంది..’ అని చెప్పారు. 

సిద్ధాన్స్‌ సరసన అక్షర కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సంతోష్‌పవన్‌, ఎమ్మెస్‌ నారాయణ, సప్తగిరి, గురుచరణ్‌, పార్వతి, విష్ణుప్రియ, జీవన్‌, రాకేష్‌, భాస్కర్‌, మాస్టర్‌ ధీరజ్‌, బేబీ యోధ మొదలగువారు ముఖ్యపాత్రలను పోషించారు. 

ఈ చిత్రానికి కథ: గుడ్డపాతల వెంకాయమ్మ, మాటలు: కరుణాకర్‌ గోపిని, మోహిత్‌ భరద్వాజ, పాటలు: చంద్రబోస్‌, అనంత శ్రీరామ్‌, సంగీతం: రోషన్‌ సాలూరి, ఛాయాగ్రహణం: కొల్లి దుర్గాప్రసాద్‌, ఎడిటింగ్‌: ఉద్ధవ్‌ ఎస్‌.బి., కళ: రామచంద్రసింగ్‌, నృత్యాలు: జోసఫ్‌ ప్రకాష్‌, వంశీ, కో`డైరెక్టర్‌: డౌలూరి నారాయణ, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: పి.ఎన్‌. నందమ్‌, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ, నిర్మాత: జమ్మలమడుగు రవీంద్రనాధ్‌, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కమల్‌. జి

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement