Advertisement

ఎన్టీఆర్‌ ఆవిష్కరించిన ‘పటాస్‌’ ఆడియో

Fri 02nd Jan 2015 09:30 AM
kalyan ram latest movie patas,telugu movie patas audio released,ntr released patas audio,patas audio function stills,patas movie music director sai karthik,raviteja at patas audio,puri jagannath at patas audio function  ఎన్టీఆర్‌ ఆవిష్కరించిన ‘పటాస్‌’ ఆడియో
ఎన్టీఆర్‌ ఆవిష్కరించిన ‘పటాస్‌’ ఆడియో
Advertisement

నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ‘పటాస్‌’ ఆడియో ఆవిష్కరణ గురువారం హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ఆడియోను ఆవిష్కరించి తొలి సి.డి.ని హీరో రవితేజకు అందించారు. థియేట్రికల్‌ ట్రైలర్‌ను సురేందర్‌రెడ్డి విడుదల చేశారు. బిగ్‌ సి.డి.ని ఎన్టీఆర్‌, రవితేజ ఆవిష్కరించారు. సాయికార్తీక్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో శ్రేయాస్‌ మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. 

ఇంకా ఈ ఆడియో వేడుకలో నందమూరి రామకృష్ణ, బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌, సినిమాటోగ్రాఫర్‌ సర్వేష్‌ మురారి, ఆర్ట్‌ డైరెక్టర్‌ తమ్మిరాజు, డ్యాన్స్‌ మాస్టర్‌ జానీ, ఫైట్‌ మాస్టర్‌ పటాస్‌ వెంకట్‌ ప్రభాస్‌ శ్రీను, ప్రవీణ్‌, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఎన్టీఆర్‌: ఈ వేడుకకి అతిథిగా కాకుండా నందమూరి తారక రామారావుగారి మనవడిగా, నందమూరి కళ్యాణ్‌రామ్‌ తమ్ముడిగా వచ్చాను. ఇప్పుడు ఇక్కడ జానకిరామ్‌ అన్నయ్య వుండి వుంటే చాలా బాగుండేది.  మేమిద్దరం ఇలా ఒకే స్టేజిపై కలిసి మాట్లాడాలనేది తాతగారి కల. మా తాతగారి ఆశీస్సులు, జానకిరామ్‌ అన్నయ్య ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం అన్నయ్య కళ్యాణ్‌రామ్‌ కృషే. రౌడీ ఇన్సెపెక్టర్‌ ఎంత పెద్ద సెన్సేషనల్‌ హిట్టయిందోఈ సినిమా కూడా అంతే పెద్ద సెన్సేషనల్‌ హిట్‌ కావాలి. 

పూరి జగన్నాథ్‌: నందమూరి కల్యాణ్‌రామ్‌గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ని అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటాను. ఓ సందర్భంలో నాగార్జునగారు నాతో మాట్లాడుతూ ఈ మధ్య నేను కల్యాణ్‌రామ్‌ని కలిశాను. చాలా పద్ధతైన మనిషి అని అన్నారు. ఈ సినిమా ట్రైలర్స్‌, సాంగ్స్‌ చాలా బావున్నాయి. అనిల్‌ తన తొలి సినిమాతోనే తనెంటో ప్రూవ్‌ చేసుకుంటున్నాడు. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి. 

రవితేజ: సాయికార్తిక్‌ చాలా మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. ట్రైలర్‌ కూడా చాలా బాగుంది. అనిల్‌కి ఈ  సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుంది. తను నెక్స్‌ట్‌ సినిమాకి రెడీ అయిపోవచ్చు. కల్యాణ్‌రామ్‌గారి బ్యానర్‌లో ప్రస్తుతం కిక్‌2 సినిమా చేస్తున్నాను. కళ్యాణ్‌రామ్‌ బంగారం లాంటి వ్యక్తి. ఈ సినిమా పెద్ద హిట్‌ అయి నిర్మాతకి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. 

సురేందర్‌రెడ్డి: ఎన్టీఆర్‌తో, కల్యాణ్‌రామ్‌తో నాకు మంచి రిలేషన్‌ ఉంది. 2015 సంవత్సరం కల్యాణ్‌రామ్‌గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అయి నిర్మాతగా, హీరోగా మంచి పేరు తీసుకువస్తుంది. ట్రైలర్‌, సాంగ్స్‌ చాలా బావున్నాయి. అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌ స్టయిల్‌ తెలుస్తుంది. సాయికార్తిక్‌ మంచి సంగీతం, బ్యాగ్రౌండ్‌స్కోర్‌ ఇచ్చాడు. టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌.

కల్యాణ్‌రామ్‌: రవితేజ, పూరిజగన్నాథ్‌, సురేందర్‌రెడ్డి, బి.గోపాల్‌గారు ఈ వేడుకకి రావడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ థాంక్స్‌. ఎన్టీఆర్‌ నా తమ్ముడే కాబట్టి తనకి థాంక్స్‌ చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా రిలీజ్‌ అయిన తర్వాతే మాట్లాడతాను.

అనిల్‌ రావిపూడి: నేను ఈ స్టేజ్‌లోకి రావడానికి చాలా మంది సపోర్ట్‌ చేశారు. ముఖ్యంగా నా తల్లిదండ్రులు, సిస్టర్‌కి థాంక్స్‌. అలాగే మా బాబాయి అరుణ్‌ప్రసాద్‌ కారణంగా నేను ఇండస్ట్రీలోకి సులభంగా రాగలిగాను. ఆయనకి కూడా థాంక్స్‌. ఆది సినిమా చూసిన నేను చేస్తే ఇలాంటి కమర్షియల్‌ సినిమా చేయాలని డిసైడ్‌ అయ్యాను. అలాగే ఈ కథను తయారు చేసుకున్న తర్వాత రెండేళ్లు వెయిట్‌ చేశాను. ఈ సినిమా ఇంత బాగా రావడానికి నందమూరి కళ్యాణ్‌రామ్‌గారే కారణం. కొత్త కల్యాణ్‌రామ్‌ని చూస్తారు. నందమూరి అభిమానులకు ఈ సినిమా ఫీస్ట్‌ అవుతుంది.

సాయికార్తిక్‌: అన్నీ ఎలిమెంట్స్‌ కుదిరిన సినిమా ఇది. మంచి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ అవుతుంది. నేను చేసిన పెద్ద కమర్షియల్‌ సినిమా ఇదే. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు అనిల్‌, నిర్మాత కళ్యాణ్‌రామ్‌గారికి థాంక్స్‌. సినిమా పెద్ద హిట్టవుతుంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement