Advertisement

సినీజోష్ రివ్యూ: పందెం కోళ్ళు

Mon 02nd Feb 2015 02:49 AM
pandemkollu,dhanush,thapsi,vetrimaran  సినీజోష్ రివ్యూ: పందెం కోళ్ళు
సినీజోష్ రివ్యూ: పందెం కోళ్ళు
Advertisement

సమూహ టాకీస్ అధ్వర్యంలో నాదెండ్ల శివకోటేశ్వర రావు సమర్పించిన సినిమా ''పందెం కోళ్ళు''. 

డైరెక్టర్        : వెట్రిమారన్

ప్రొడ్యూసర్స్ : ఏ. శేఖర్ బాబు, ఎం. కిషోర్ కుమార్ రెడ్డి

డైలాగ్స్       : రాజశేఖర్ రెడ్డి

లిరిక్స్         : వనమాలీ

సంగీతం      : జి.వి.ప్రకాష్

నటీనటులు  : ధనుష్, తాప్సీ

న్యూ ఇయర్ కానుకగా 'రఘువరన్ బిటెక్' సినిమాను విడుదల చేసి తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన తమిళ స్టార్ హీరో ధనుష్. తమిళంలో 'అదుకాలమ్' అనే పేరుతో రిలీజ్ అయ్యి నేషనల్ అవార్డ్ అందుకున్న సినిమాను తెలుగులో 'పందెం కోళ్ళు' గా రిలీజ్ చేసారు. మరి ఈ ఇయర్ మొదట్లో రఘువరన్ బిటెక్ తో వచ్చిన ధనుష్ ఈ పందెం కోళ్ళ పోటీలో గెలిచాడో లేదో సమీక్షలో తెలుసుకుందాం. 

కథ : సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు కోడిపందెలతో తెలుగు వాళ్ళు అంతా చాలా బిజీ అయిపోతారు. అలాంటి కోడిపందెలను పరువుగా భావించే పల్నాడు ప్రాంతంలో ఒక ఊరి కథ ఇది. పోతురాజు(జయ్ పాలన్), రాంస్వామి(నరేన్) అనే వ్యక్తులకు ప్రతి ఏడాది కోడిపందాల పోటీ జరుగుతూ ఉంటుంది. రాంస్వామి ఎప్పుడూ పోతురాజు చేతులో ఓడిపోతూనే ఉంటాడు. పోతురాజు దగ్గర ఎంతో నమ్మకంగా శిష్యుడిగా ఉండే వ్యక్తి లింగం (ధనుష్). ధనుష్ ఐరిన్(తాప్సి) ని చూసి ఇష్టపడతాడు. పోతురాజుకు రాంస్వామి కి మధ్య భారీ కోడిపందాలకు తెర తీస్తుంది. ఆ సమయంలో లింగం కు పోతు రాజుకు మధ్య గొడవ జరుగుతుంది. అసలు పోతురాజుకు లింగం కు మధ్య గొడవ ఎందుకు జరుగుతుంది. దానికి కారణం ఎవరు? అనే విషయాలు తెలుసుకోవడానికి సినిమా చూడాల్సిందే..!

సినిమాలో పాజిటివ్ : ధనుష్ నటన సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది. సినిమాలో ఎక్కువ శాతం లుంగీలోనే కనిపించి మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. వెట్టిమారన్ కథ ను నడిపించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. జి.వి ప్రకాష్ సినిమాకు అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాలో మెయిన్ రోల్స్ లో నటించిన వారు తెలుగు ప్రేక్షకులకు కొత్తవారైనా వారి పెర్ఫార్మెన్సు తో ఆకట్టుకున్నారు. ధనుష్, తాప్సి మధ్య లవ్ ట్రాక్ ను వెట్టిమారన్ చాలా బాగా నడిపించాడు.

ఇంటర్వెల్ ఎపిసోడ్ లో వచ్చే కోడిపందాల పోటీ చాలా ఎక్సైటింగ్ గ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో హ్యూమన్ ఎమోషన్స్ ని బాగా తెరకెక్కించారు. 

డ్రాబ్యాక్స్ :  సెకండ్ హాఫ్ లో సినిమాను సాగదీసి తీసారు. దీంతో ఆడియన్స్ కి బోరింగ్ గా అనిపిస్తుంది. రూరల్ బ్యాక్ గ్రౌండ్ లో తీయడం వల్ల క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోవచ్చు. 

వివరణ : వెట్టిమారన్ కథ, కథనం ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఈ ఇయర్ లో ధనుష్ రెండవ సినిమాతో కూడా హిట్ కొట్టాడనే చెప్పాలి. తను నటించిన తీరుకు ఖచ్చితంగా నేషనల్ అవార్డు రావాల్సిందే. లవ్ ట్రాక్ , హ్యూమన్ ఎమోషన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేశారు. సినిమా చూస్తే యూనిట్ అంతా చాలా కష్టపడి తీసారని తెలుస్తుంది. యాక్షన్ సన్నివేశాలను చాలా రియలిస్టిక్ గా తెరకెక్కించారు. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం బాలేవు.  

ట్యాగ్ లైన్ : రొటీన్ సినిమాలు చూసి బోర్ కొడితే ఈ సినిమా చూడొచ్చు.  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement