Advertisement

తెలుగు భాషను బతికిస్తున్నది పత్రికా రంగమే..!

Sat 21st Feb 2015 03:55 AM
telugu news papers,surya,telugu language,live  తెలుగు భాషను బతికిస్తున్నది పత్రికా రంగమే..!
తెలుగు భాషను బతికిస్తున్నది పత్రికా రంగమే..!
Advertisement

ప్రపంచ మాతృ భాషా ‘పరిరక్షణ’ దినోత్సవం ఫిబ్రవరి 21.

ప్రపంచ మూడో తెలుగు రచయితల మహాసభలు, ఫిబ్రవరి 21న విజయవాడలో ఆరంభం!

లిపి వున్న ఏ భాషా అంతరించిపోదు. బతుకుతెరువుకోసం, వ్యాపారంకోసం, విద్య వైద్యం కోసం పలు భాషల వారు, పలు రాష్ట్రాల వారు మన మధ్య తెలుగు గడ్డపై నివసిస్తున్నారు. వారు ఇళ్ళలో మాట్లాడుకునేది వారి మాతృభాషలోనే. తెలుగు పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదువుతూ వుండవచ్చు. సెకండ్‌ లాంగ్వేజ్‌ సంస్కృతం, ఫ్రెంచి, జర్మన్‌ తదితర భాషలు తీసుకోవచ్చు. వారిలో చాలామందికి తెలుగు చదవను, రాయను రాకపోవచ్చు: వారు ఇంట్లో మాట్లాడేది వారి మాతృభాషలోనే. తెలుగు భాషను ప్రస్తుతం బతికిస్తున్నది తెలుగు దినపత్రికలే! విజువల్‌ మీడియా అందిస్తున్న బ్రేకింగ్‌ న్యూస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌కి మోకాళ్ళడ్డి తెలుగుభాషను బతికిస్తున్నది ఈ దినపత్రికలు, స్వాతి, నవ్య, ఆంధ్రభూమి వంటి వార పత్రికలే! నెటిజన్స్‌ నెట్‌లో పత్రికలు చూస్తుంటారు. కానీ చాలామందికి రాత్రికి రాత్రే బ్రేకింగ్‌ న్యూస్‌ టివిలో చూసినా, మరుసటి రోజు దినపత్రిక చదివితే గాని తృప్తి చెందరు. భారత భాగవత రామాయణాదులను పిల్లలకి పరిచయంచేసిన ‘చందమామ’ మూతపడటానికి ముఖ్యకారణం: ఆర్ధిక కారణాలు! తెలుగు పుస్తకం ధర పాఠకుని బడ్జెట్‌ అనుమతించడంలేదు. దినపత్రిక ధర, పుస్తకాల ధర తగ్గిన రోజున పత్రికా పాఠకులు పెరుగుతారు. పేపరు, ఇంక్‌ వంటి ముద్రణా వస్తువులను సబ్సిడీ ధరపై అందజేయండి. కవితా సంకలనాలు, పుస్తకాల ముద్రణకు రచయితకు ఆర్ధికంగా వెసులుబాటు కల్పిస్తూ గ్రంధాలయాలకు కొనుగోలు చేయండి. టిటిడి వంటి ధార్మిక సంస్థలవలె పేపరు, ఇంక్స్‌ సరఫరా చేయండి: ఆ విలువ మేరకు పుస్తకాలు తీసుకొని లైబ్రరీలకు ఇవ్వండి!

ఆఖరిగా ఒక్క ప్రశ్న : రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షలు ఏ మాధ్యమంలో జరుగుతున్నాయి? తెలుగులో చదువుకున్న విద్యార్ధి జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయి పరీక్షలలో పాల్గొనగలడా? తెలుగు మాధ్యమంలో చదువుకున్న వారికి ఉన్నత విద్యాలయాలలో ప్రవేశానికి ఉద్యోగాలలో ప్రాధాన్యత ఇస్తున్నారా?

మాతృభాషలో భావితరాలు చదవనూ రాయనూ రావాలంటే ముద్రణారంగంలో పత్రికలకు, రచనలకు రక్షణ కల్పించాలి. వాటి ధరలు సగటు పాఠకునికి అందుబాటులోకి రావాలి. లేనంతకాలం రాజకీయ పునరావాసానికి ఓ వేదికగా ఈ సభలు మిగిలిపోతాయి.

-తోటకూర రఘు

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement