Advertisement

ఏపీ, తెలంగాణల మధ్య రాజుకుంటున్న కొత్త వివాదం..!!

Tue 03rd Mar 2015 06:33 AM
baverage company,it,tax,ap,telangana  ఏపీ, తెలంగాణల మధ్య రాజుకుంటున్న కొత్త వివాదం..!!
ఏపీ, తెలంగాణల మధ్య రాజుకుంటున్న కొత్త వివాదం..!!
Advertisement

ఏపీ, తెలంగాణల మధ్య మరో వివాదం రాజుకునేలా కనిపిస్తోంది. కేంద్రానికి చెందిన ఐటీ శాఖకు ఉమ్మడి రాష్ట్రంలోని బెవరెజెస్‌ కంపెనీలు రూ. 9 వేల కోట్ల వరకు పన్ను చెల్లించాల్సి ఉంది. గత పదేళ్లుగా ఈ సంస్థలు పన్ను చెల్లించకపోవడంతో మొత్తం రూ. 9 వేల బకాయి పేరుకుపోయిందని, వెంటనే చెల్లించాలంటూ కొద్దికాలంగా ఐటీ శాఖ నోటీసుల మీద నోటీసులిస్తోంది. అయితే ప్రభుత్వ రంగంలోని బెవరెజెస్‌ కంపెనీలు పన్నులు చెల్లించకున్నా.. జరిగేది ఏమీ లేదంటూ ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లైట్‌ తీసుకున్నారు. ఇక లాభం లేదని ఆలోచించిన ఐటీశాఖ కొన్ని బెరరెజెస్‌ కంపెనీలను సీజ్‌ చేసింది. దీంతో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆందోళనలో పడిపోయాయి. ఇక మద్యం మీద వచ్చే ఆదాయమే ఇరు రాష్ట్రాలకు ప్రధానం కావడంతో ఇలా బెవరెజెస్‌ కంపెనీలన్నింటినీ మూస్తే తమకు ఇబ్బందేనని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇది ఇలాగవుంటే బెవరెజెస్‌ కంపెనీలు తెలంగాణలో అధికంగా ఉన్నాయి. దీన్నిబట్టి తెలంగాణనే అధిక పన్ను చెల్లించాలని ఏపీ వాదిస్తోంది. అయితే చెల్లించాల్సిన బకాయి ఉమ్మడి రాష్ట్రంలోదని, అప్పుడు బెవరెజెస్‌ కంపెనీలపై వచ్చిన ఆదాయం ఇరు ప్రాంతాలకు వినియోగించారని, కాబట్టి సమానంగా పన్ను చెల్లించాలని తెలంగాణ చెబుతోంది. మరి ఈ వివాదం మరెన్ని వాదప్రతివాదాలకు దారి తీస్తుందో వేచిచూడాలి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement