Advertisement

దర్శకుడు శంకర్ నెక్స్ట్ సినిమా..!

Wed 28th Jan 2015 04:55 AM
  దర్శకుడు శంకర్ నెక్స్ట్ సినిమా..!
దర్శకుడు శంకర్ నెక్స్ట్ సినిమా..!
Advertisement

తాను తీసిన 'ఐ' చిత్రం విమర్శకుల నుండి తీవ్ర విమర్శలు  ఎదుర్కొంటుండటంతో దర్శకుడు శంకర్  అప్పుడే తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టాడు. వాస్తవానికి 'ఐ' పరాజయం నేపధ్యంలో శంకర్ మరోసారి రజనీకాంత్ తోనే 'రోబో 2' చిత్రం చేస్తాడని కోలీవుడ్ వర్గాలు భావించాయి. కానీ ముందుగా వచ్చిన వార్తల ప్రకారమే శంకర్ మరో తమిళ స్టార్ హీరో అజిత్ తో సినిమా తీయడానికి ఫిక్సయ్యాడని తెలుస్తోంది. శంకర్ చిత్రం అనగానే ఇక అజిత్ కూడా పచ్చజెండా ఊపాడని సమాచారం. సాధారణంగా శంకర్ తో సినిమా అంటే హీరోలు భయపడే పరిస్థితి వచ్చింది. తాను అనుకున్న అవుట్ పుట్ కోసం హీరోలతో తీవ్ర మానసిక, శారీరక శ్రమను చేయిస్తాడనే చెడ్డపేరు ఆయనకు విక్రమ్ వల్ల వచ్చింది. అలాగే శంకర్ తో అంటే కనీసం రెండేళ్ళు సినిమా కోసం డేట్స్ కేటాయించాల్సిన పస్థితి ఉంటుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శంకర్-అజిత్ ల చిత్రానికి చాలాకాలం నిర్మాణరంగానికి దూరంగా ఉంటూ వస్తోన్న ఎ.యం.రత్నం నిర్మాణ బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement